తిరుమల శ్రీవారిని విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి దర్శించుకున్న వారిలో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలవుతున్నా విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి సమయంలో తిరుమల శ్రీవారి ఆశీస్సులు తమ ప్రభుత్వం పై ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - మాజీ మంత్రి రఘువీరారెడ్డి
తిరుమల శ్రీవారిని విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు