ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అదే నిదర్శనం: చంద్రబాబు

By

Published : May 2, 2021, 7:44 PM IST

ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైకాపా చర్యలకు వ్యతిరేకంగా తిరుపతి ఉప ఎన్నికలో పోరాడిన కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియడారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గటం వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందన్నారు.

cbn on tirupathi by poll result
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అదే నిదర్శనం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైకాపా నేతల అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన తెదేపా శ్రేణులకు అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గటం వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైకాపా చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియడారు. ఐదు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైకాపా శ్రేణులకు ఓటుతో బుద్ధి చెప్పిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు.

'అది ప్రజా విజయం కాదు'

తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాది ఓ గెలుపేనా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. 5 లక్షల మెజార్టీతో గెలుస్తామని ప్రగల్భాలు పలికి సగానికి పడిపోయిందన్నారు. ఆ గెలుపు కూడా దొంగ ఓట్లతోనేనని ఆయన ఆరోపించారు. మంత్రులు, అధికారులు, వాలంటీర్లు, పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తే.. పెద్దఎత్తున దొంగ ఓట్ల సాయంతో ఈ గెలుపు సాధ్యమైందన్నారు. అంతే తప్ప ప్రజా విజయం కాదన్నారు.

ఇదీచదవండి

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం

ABOUT THE AUTHOR

...view details