ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ సిఫార్సు లేఖ ఫోర్జరీ...దళారిపై కేసు నమోదు - తెలంగాణ ఎంపీ లేఖను ఫోర్జరీ చేసిన దళారిపై కేసు నమోదు

తిరుమల శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లను.. ఓ ఎంపీ నకిలీ సిఫార్సు లేఖ మీద పొందిన దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ టిక్కెట్లను హైదరాబాద్​కి చెందిన వేరొకరికి.. రూ. 11 వేలకు విక్రయించినట్లు నిర్ధరణ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ ఎంపీ పీఏకు.. తిరుమల విజిలెన్స్ అధికారులు ఫోన్ చేయడంతో.. అసలు విషయం వెలుగుచూసింది.

broker arrest for using fake letter
నకిలీ లేఖతో టిక్కెట్లు పొందిన దళారి అరెస్ట్

By

Published : Nov 26, 2020, 10:56 PM IST

నకిలీ సిఫార్సు లేఖపై తిరుమల శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లను పొంది.. అధిక ధరలకు విక్రయించిన దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్​కు చెందిన దినేష్ అనే భక్తుడు.. తిరుపతిలోని దళారి రాఘవను సంప్రదించాడు. నలుగురికి వీఐపీ దర్శనం కల్పించేందుకు.. తెలంగాణ రాష్ట్రం అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు సిఫారసు లేఖను జేఈవో కార్యాలయంలో సమర్పించారు. అదే రోజు మరో లేఖ రాగా.. అనుమానం వచ్చిన తితిదే విజిలెన్స్ అధికారులు ఎంపీ పీఏను సంప్రదించారు.

ఎంపీ ఒకే లేఖ ఇచ్చినట్లు నిర్ధరించుకున్న సిబ్బంది.. సంబంధిత భక్తులను విచారించారు. దళారి రాఘవేంద్ర నుంచి నాలుగు టికెట్లను.. రూ. 11 వేలు చెల్లించి తీసుకున్నట్లు వారు తెలిపారు. భక్తుల ద్వారా తిరుమల రెండవ పట్టణ పోలీసు స్టేషన్​లో అధికారులు ఫిర్యాదు చేయించారు. భక్తులను మోసగించడంతో పాటు సిఫార్సు లేఖను దళారీ ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. నిర్ధరణ కోసం లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించి విచారణ జరుపుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details