తిరుపతి ఏడో వార్డు ఎన్నిక నిలుపుదలను సవాలు చేస్తూ.. దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తెదేపా తరఫున నామినేషన్ వేసిన విజయలక్ష్మి సంతకం ఫోర్జరీ, నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి పిటిషనర్ తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు.. న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
తిరుపతి ఏడో వార్డు ఎన్నిక నిలుపుదలపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ - high court latest news
తిరుపతి ఏడో వార్డు ఎన్నిక నిలుపుదలను సవాలు చేస్తూ.. దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఆదేశించారు.

ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ విచారణ చేసి నివేదిక సమర్పించేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ సీహెచ్ సుజాత తరపు న్యాయవాది ప్రశాంత్... పోలీసులు విచారణ జరుపుతున్నారన్న కారణంతో ఎన్నికను నిలుపుదల చేయడం సరికాదన్నారు. ఎన్నిక జరిపేలా ఆదేశించాలని కోరారు. ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఇదీ చూడండి: ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యేక చర్యలు: ఎస్ఈసీ