తితిదేపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు - తిరుపతిపై సోషల్ మీడియాలో పోస్టులు
తిరుమల తిరుపతి దేవస్థానంపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై... తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు తితిదేపై దుష్ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తితిదేపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు
తితిదేపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పలు విషయాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తితిదే ఫిర్యాదులో పేర్కొంది.