ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల కనుమ దారిలో ప్రమాదం.. నలుగురు భక్తులకు గాయాలు - తిరుమల తాజా వార్తలు

తిరుమల మెుదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భక్తులు శ్రీవారి దర్శనం ముగించుకుని వస్తుండగా ఘటన జరిగింది.

tirumala ghat road accident
తిరుమల కనుమ దారిలో ప్రమాదం

By

Published : Jan 2, 2021, 9:45 PM IST

తిరుమల మొదటి కనుమ దారిలో రెండు కార్లు ఢీ కొన్నాయి. శ్రీవారి దర్శనానంతరం తిరుగు పయనమైన యాత్రికుల కారు 35వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొంది. వెనుక వస్తున్న మరో కారు ప్రమాదానికి గురైన కారును ఢీకొనడంతో.. హైదరాబాద్​కు చెందిన నలుగురు భక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో మొదటి కనుమ దారిలో కొంత సమయం ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details