ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో ఈ నెల 6 నుంచి బస్సుల ట్రైల్​ రన్ - తిరుమల శ్రీవారి దర్శనం వార్తలు

ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభంకానున్నందున అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. భక్తులు సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ రోడ్డుపై బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది ఆర్టీసీ.

Bus Trail Run from 6th of this month in Tirumala
Bus Trail Run from 6th of this month in Tirumala

By

Published : Jun 3, 2020, 11:09 PM IST

తిరుపతి ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం మధుతో ముఖాముఖి

కలియుగ వైకుంఠనాధుడు....తిరుమల శ్రీనివాసుడు సుదీర్ఘ కాలం తర్వాత భక్తులకు పున:దర్శనమివ్వనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రత్యేకించి వేలాది భక్తులను తిరుమల శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లటంలో కీలక పాత్రపోషించే ఆర్టీసీ....ఘాట్ రోడ్డుపై బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు సర్వం సన్నద్ధం చేస్తోంది.

లాక్​డౌన్ కారణంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈనెల 11నుంచి శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్న తరుణంలో.... 6వ తేదీ నుంచే బస్సుల ట్రైల్​ రన్​ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్​పై సప్తగిరి ఎక్స్​ప్రెస్​లను మళ్లీ పరిగెత్తించేలా బస్సులన్నింటినీ కండిషనింగ్ చేయటంతో పాటు.... కొవిడ్ -19 ప్రోటోకాల్​ను పక్కాగా పాటించేలా డ్రైవర్లకు, కండక్టర్లకు తర్ఫీదునిచ్చామంటున్న తిరుపతి ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం మధుతో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి...

ABOUT THE AUTHOR

...view details