ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో బైక్ దొంగలతో బేజారు.. వారంలోనే 7 వాహనాలు మాయం - bullet vihicles thest news

తిరుపతి పరిసర ప్రాంతాల్లో బుల్లెట్ బైకుల దొంగలు వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాత్రి పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం తెల్లారే వరకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. వారం రోజుల్లోనే ఏడు బుల్లెట్ వాహనాలను దొంగలు చోరీ చేశారు. పోలీసులు వారి అన్వేషణలో ఉన్నారు.

bullect thesfts
తిరుపతిలో బుల్లెట్ దొంగలతో బేజారు.. వారంలోనే ఏడు బుల్లెట్ వాహనాలు గాయబ్

By

Published : Mar 7, 2021, 11:43 AM IST

తిరుపతిలో బుల్లెట్ దొంగలతో బేజారు.. వారంలోనే ఏడు బుల్లెట్ వాహనాలు గాయబ్

ఇంటి ముందు నిలిపిన బుల్లెట్ వాహనాలను మాయం చేస్తూ.. వాహనదారులను దొంగలు బేజారెత్తిస్తున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వారం రోజుల్లో ఏడు బుల్లెట్ వాహనాలు చోరీకి గురయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలైన పుదిపట్ల, విద్యానగర్, పాతకాల్వలలో ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ఏడు బుల్లెట్ వాహనాలను దొంగలు చోరీ చేశారు. బాధితులు ఎం.ఆర్.పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. ఇద్దరు దొంగలు వాహనాలను తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details