తిరుపతి నగరపాలక సంస్థ ఉపకమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి కార్యాలయంలో బుధవారం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. కాంక్రీటు, పైకప్పు అలంకరణకు వాడిన పీవోపీ షీట్స్.. కంప్యూటర్లు, ఇతర వస్తువులపై పడటంతో దెబ్బతిన్నాయి. తిరుపతి నూతన మేయర్ శిరీష అదే భవనం పైఅంతస్తులో బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా.. అందుకు గంట ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సిబ్బంది గదిలోకి వెళ్లి విషయం ఉన్నతాధికారులకు తెలిపారు. సమయానికి కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పాత భవనం కావడంతో ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
నగరపాలక సంస్థలో ఊడిన భవనం పెచ్చులు.. దెబ్బతిన్న సామగ్రి - tirupathi municipal building roof blown news
తిరుపతి నగరపాలక సంస్థలో భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. కార్యలయంలోని వస్తువులు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నగరపాలక సంస్థలో ఊడిన భవనం పెచ్చులు.. దెబ్బతిన్న సామగ్రి