తిరుపతి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవరోజు స్వామివారు చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చారు. సర్వాలంకారభూషితుడైన గోవిందరాజస్వామి చిన్నశేషుడిని అధిరోహించి.. భక్తులను కటాక్షించారు. కరోనా ప్రభావంతో ఆలయంలోనే వాహన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మద్య అభిషేకాదులు, ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.