- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది. మార్చి 4వ తేదీ సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు..
- 04-03-2021 - ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం హంస వాహనం
- 05-03-2021 - ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం
- 06-03-2021- ఉదయం భూత వాహనం, సాయంత్రం సింహ వాహనం
- 07-03-2021- ఉదయం మకర వాహనం, సాయంత్రం శేష వాహనం
- 08-03-2021- ఉదయం తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం అధికారనంది వాహనం
- 09-03-2021- ఉదయం వ్యాఘ్ర వాహనం, సాయంత్రం గజ వాహనం
- 10-03-2021- ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం అశ్వవాహనం
- 11-03-2021- ఉదయం రథోత్సవం, సాయంత్రం నందివాహనం
- 12-03-2021 - ఉదయం పురుషామృగవాహనం సాయంత్రం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
- 13-03-2021 - ఉదయం రావణాసుర వాహనం సాయంత్రం సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం