నేత్రపర్వం.. కల్పవృక్ష వాహనంపై స్వామి విహారం - కల్పవృక్ష వాహన సేవ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. కల్పవృక్ష వాహన సేవ నేత్ర పర్వంగా ముగిసింది.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి రాజమన్నార్ అలంకారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అతి విలువైన కల్పవృక్షంపై అధిరోహించి మాడ వీధుల్లో విహరించే స్వామివారిని దర్శించుకొంటే కోరిన కోర్కెలు తీరతాయన్న విశ్వాసంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి వాహనసేవ ముందు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను అలరించారు. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి మాడ వీధుల్లో నుంచి భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. రాత్రికి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.