తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్ రాయల్‌ను గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా.. ఆదివారం ఉదయం 5.45 గంటలకు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాలుడిని కిడ్నాప్ చేసి ఆర్టీసీ బస్సులో మహిళ తిరుపతి వచ్చినట్లు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఏపీ03 జడ్ 0300 బస్సులో మహిళ ప్రయాణించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి:విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా
Kidnap: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ - తిరుపతి జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్
09:23 May 02
గోవర్దన్ రాయల్‌ను ఎత్తుకెళ్లిన మహిళ
Last Updated : May 2, 2022, 11:39 AM IST