ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hanuman birth story : హనుమంతుడి జన్మవృత్తాంతంపై పుస్తకం... ఎప్పుడంటే..

Hanuman birth story : శ్రీఆంజనేయస్వామివారి జన్మవృత్తాంతంపై ఈనెల 16న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు తిరుమల అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలానికి.. ఈ నెల 16న మాఘ పౌర్ణమి నాడు భూమి పూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Jawahar Reddy
Jawahar Reddy

By

Published : Feb 9, 2022, 9:01 AM IST

Hanuman birth story : తిరుమల ఆకాశగంగ సమీపంలో శ్రీఆంజనేయస్వామివారి జన్మవృత్తాంతంపై ఈనెల 16న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు అంజనాద్రిలో హనుమంతుడి జన్మస్థలం వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. భూమిపూజ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అంజనాదేవి, బాలఆంజనేయస్వామివారి ఆలయం ఎదురుగా ముఖమండపం, గోపురాలు నిర్మిస్తామన్నారు. తితిదే పాలకమండలి మాజీ సభ్యులు నాగేశ్వరరావు, మురళీకృష్ణ ఆర్థికసాయంతో ప్రముఖ సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. తరిగొండ వెంగమాంబ బృందావనంలోని ఎకరన్నర స్థలంలో ధ్యానమందిరం, ఉద్యానవనం నిర్మాణానికి కార్యాచరణ రూపొందించి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details