బాలీవుడ్ క్రేజీ జంట దీపిక- రణ్వీర్ సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తమ వివాహ వార్షికోత్సవాన్ని స్వామి సన్నిధిలో జరుపుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి వారిని శేషవస్త్రంతో సత్కరించారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయిన దీప్-వీర్ జంటను ఆలయం వెలుపల అభిమానులు పలకరించారు. రేపు ఉదయం వీరు అమృత్‌సర్‌కు వెళ్లి స్వర్ణ దేవాలయాన్ని కూడా దర్శించనున్నారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఇవాళ ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు.
కొండపైన రణ్వీర్-దీపిక; స్పెషల్ ఏంటంటే..!? - ranveer deepika latest news in tirumala
బాలీవుడ్ జంట దీపికా రణవీర్ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీనివాసుని దర్శించుకున్నారు. మొదటి పెళ్లి రోజుని స్వామి సన్నిధిలో జరుపుకున్నారు.
ttd
Last Updated : Nov 14, 2019, 2:56 PM IST
TAGGED:
Bollywood couple in tirumala