ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SUICIDE: పద్మావతి కొవిడ్​ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్​ రోగి ఆత్మహత్య

తిరుపతి స్విమ్స్​ పద్మావతి కొవిడ్​ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న జయమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మనస్థాపంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Black fungus patient commits suicide
బ్లాక్ ఫంగస్​ రోగి ఆత్మహత్య

By

Published : Jun 13, 2021, 3:17 PM IST

తిరుపతి స్విమ్స్​ పద్మావతి కొవిడ్​ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న జయమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఆస్పత్రిలోని బాత్​రూమ్​లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త లేకపోవడం, వైద్య ఖర్చుల భారం పిల్లలపై పడుతుందని మనస్థాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

నెల్లూరుకు చెందిన జయమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేసేవారు. గత నెలలో కరోనా బారిన పడి కోలుకున్నారు. అనంతరం బ్లాక్​ఫంగస్​ సోకటంతో పద్మావతి కొవిడ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్య ఘటనపై స్పందించిన ఆర్డీవో కనక నరసారెడ్డి ఆస్పత్రిని పరిశీలించారు. జయమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు. కొంతమంది రోగుల బంధువులు తమ వారికి సరైన వైద్యం అందటం లేదంటూ ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details