కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సీఎం జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తిరుపతిలో విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడంపైనే.. ప్రభుత్వం తన దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దందా కొనసాగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీకాలు వేయడంలో, మందుల ధరలను నియంత్రించడంలో.. వైద్య, ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
'కొవిడ్ కట్టడిపై కాకుండా... ప్రతిపక్ష నేతల అరెస్ట్పైనే ప్రభుత్వం దృష్టి' - రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖలపై భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖలపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడంపైనే సీఎం జగన్ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి