ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మండలానికో మంత్రి.. ఇదీ వైకాపా పరిస్థితి: సోము వీర్రాజు - Somu Veerraju comments On YCP

వైకాపా భాజపాను చూసి ఎందుకు భయపడుతోందని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైకాపా... మండలానికో మంత్రిని పెట్టుకునే పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉపఎన్నికతో తమ జైత్రయాత్రను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

సోము వీర్రాజు
సోము వీర్రాజు

By

Published : Mar 31, 2021, 7:45 PM IST

సోము వీర్రాజు

రాష్ట్రంలో తమకు బలం లేకపోతే... అధికార వైకాపా ఎందుకు భయపడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ ఉపఎన్నిక ద్వారా భాజపా - జనసేన కూటమి రాష్ట్రంలో జైత్రయాత్రను ప్రారంభిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అధిక మెజార్టీతో గెలుస్తామని చెబుతున్న వైకాపా... మండలానికి ఒక మంత్రిని ఇంఛార్జ్​గా పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉందన్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకు ఇతర పార్టీలు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. రజకులను ఎస్సీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్​కు భాజపా మద్దతిస్తోందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details