ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక బరిలో భాజపా... సోము వీర్రాజు ప్రకటన! - bjp somu veerraju latest news

తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు. జనసేన బలపరిచే భాజపా అభ్యర్థికే ఓటేయాలని తిరుపతిలో బహిరంగంగా చెప్పారు. ఓ వైపు కూటమి అభ్యర్థిపై చర్చలు జరుగుతుండగానే ఆయన ఈ ప్రకటన చేయటంతో జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

bjp somu veerraju
bjp somu veerraju

By

Published : Dec 12, 2020, 8:54 PM IST

Updated : Dec 12, 2020, 9:17 PM IST

సోము వీర్రాజు ప్రసంగం

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికలో భాజపా-జనసేన పార్టీ కూటమి నుంచే ఎవరు పోటీ చేస్తారన్న అంశం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. శనివారం తిరుపతిలో భాజపా నిర్వహించిన శోభాయాత్రలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. వైకాపా అవినీతి పాలనకు గుణపాఠం చెప్పాలంటే తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఆయన కోరారు.

చంద్రబాబు(తెదేపా)కు పార్లమెంట్​లో నాలుగు సీట్లు ఉన్నాయి. దిల్లీలో వారికేం పని లేదు. జగన్​కి 22 సీట్లు ఉన్నాయి. వాళ్లకి నెగ్గినా ఉపయోగం లేదు. వచ్చే ఉప ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే తిరుపతిని స్వర్ణమయం చేస్తాం. జనసేన బలపరిచే భాజపా అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించండి- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

వాస్తవానికి భాజపా-జనసేన సంయుక్త చర్చల తర్వాతే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని భాజపా అధినాయకత్వం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి

భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

Last Updated : Dec 12, 2020, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details