తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్‌కు ముందు చర్చికి వెళ్లి ప్రార్థన చేసి ఫేస్‌బుక్‌లో పెట్టి తొలగించారని.. ఎందుకంత భయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య శిలువను మోశారన్నారు. మంగళవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం మాట్లాడరని, నేరస్థులను ఇంతవరకు పట్టుకోలేదని విమర్శించారు. హంద్రీ- నీవా, గాలేరు - నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంపై చంద్రబాబు, జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందుత్వం అంటే హేళనా?: సోము వీర్రాజు - ఏపీ తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వానికి హిందుత్వం అంటే హేళన.. చులకనగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
bjp