ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది- జేపీ నడ్డా - నెల్లూరులో భాజపా బహిరంగ సభ

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు నేతలు స్వాగతం పలికారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా
bjp president jp nadda

By

Published : Apr 12, 2021, 2:48 PM IST

Updated : Apr 12, 2021, 4:48 PM IST

జేపీ నడ్డాకు స్వాగతం పలికిన భాజపా-జనసేన నేతలు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద భాజపా - జనసేన నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి మురళీధరన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు.. స్వాగతం పలికారు. అక్కడ్నుంచి తిరుమలకు చేరుకుని..స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో పాల్గొననున్నారు.

'శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. కరోనా నుంచి భారత్ విముక్తి కలగాలని ప్రార్థించా. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - 'జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

Last Updated : Apr 12, 2021, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details