తిరుమల తిరుపతి దేవస్థానం భూములను విక్రయించడం అంటే...భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. స్వామివారి ఆస్తులను వేలం వేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉపవాస దీక్ష నిర్వహిస్తుందని తెలిపారు.
ఆస్తుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి: జీవీఎల్
తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వమే గతంలో ఈ నిర్ణయం తీసుకుందని తప్పించుకోవటం సరికాదన్నారు.
bjp mp gvl narasimha rao