అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం హిందూ ప్రజల చిరకాల వాంఛ అంటూ తిరుపతిలో భాజపా నేతలు పేర్కొన్నారు. కోదండ రామాలయంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. అయోధ్య ఆలయ నమూనా ఉన్న చిత్రపటానికి హారతులు ఇచ్చారు. అనంతరం జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో దీపాలు వెలిగించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.
అయోధ్య ఆలయ నమూనాకు ప్రత్యేక పూజలు - అయోధ్య రామ మందిర్
తిరుపతి కోదండ రామాలయంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. అయోధ్య ఆలయ నమూనా ఉన్న చిత్రపటానికి హారతులు ఇచ్చి.. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హిందూ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందంటూ ఆయన తెలిపారు.
తిరుపతి కోదండ రామాలయంలో భాజపా నేతల ప్రత్యేక పూజలు