ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొడాలి వ్యాఖ్యలపై భాజపా మండిపాటు..క్షమాపణకు డిమాండ్ - tirumala news

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రి కొడాలి నాని...తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భాజపా నేతలు తిరుపతిలో డిమాండ్ చేశారు.

tirupathi
భాజపా నేతల నిరసన

By

Published : Sep 21, 2020, 3:11 PM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదనడంతో పాటు...హిందూ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ... తిరుమల తిరుపతి సంరక్షణ సమితి, భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుపతి గరుడ కూడలిలో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బాధ్యతాయుత పదవిలో ఉంటూ...హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై ధర్నాలో పాల్గొన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని....సీఎం స్పందించకపోతే ఆందోళ ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి:మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. మంచిది కాదు: రఘురామకృష్ణరాజు

ABOUT THE AUTHOR

...view details