ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వాలంటీర్లను రాజకీయ లబ్ధికి వినియోగిస్తున్నారు'

వైకాపా ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయ లబ్ధికి వినియోగిస్తోందని రాష్ట్ర భాజాపా నేతలు ఆరోపించారు. తిరుపతి ఎన్నికల్లో వాలంటీర్లు దూరంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

bjp leaders comments on ysrcp on Tirupati by elections
bjp leaders comments on ysrcp on Tirupati by elections

By

Published : Apr 15, 2021, 4:34 PM IST

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజల్లోకి తీసుకువెళ్తే.. రాష్ట్ర మంత్రులు వాటిని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన భాజపా ఎంపీలు సీఎం రమేశ్​, టీజీ వెంకటేష్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. మంత్రుల వ్యాఖ్యలను ఖండించారు.

ఇసుక, మద్యం విక్రయాల్లో వైకాపా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని నడ్డా ప్రసంగిస్తే.. ప్రభుత్వ పథకాలు ఆపేస్తారని ప్రచారం చేస్తున్నారన్నారని ఎంపీ సీఎం రమేష్ తప్పుబట్టారు. రాయలసీమ వెనుకబాటు తనం నుంచి విముక్తి కావాలంటే భాజపాను గెలిపించాలని టీజీ వెంకటేష్ కోరారు. భాజపా ఏజెంట్లను వాలంటీర్లు, పోలీసులు బెదిరిస్తున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. వాలంటీర్లను రాజకీయ లబ్ధికి వినియోగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో వాలంటీర్లు దూరంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details