వైకాపా ప్రభుత్వం భవనాలకు, వాహనాలకు కాకుండా ప్రజల జీవితాల్లో రంగులు నింపాలని భాజాపా నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన... ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలిసే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల మీద దృష్టి తగ్గించి ప్రజలకు మేలు చేయాలన్నారు. ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టు ఆదేశాలను వైకాపా లెక్కచేయడం లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు వదలి అన్ని మతాలను గౌరవిస్తూ దేవాలయాల ఆస్తులను పరిరక్షించాలని ఆయన అన్నారు.
'ప్రతిపక్షాల మీద దృష్టి తగ్గించి ప్రజలకు మేలు చేయాలి' - శ్రీవారిని దర్శించుకున్న భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి
ప్రభుత్వం ప్రతిపక్షాల మీద దృష్టి తగ్గించి ప్రజలకు మేలు చేయాలని భాజాపా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. తిరుమల వైకుంఠనాథుడిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టు ఆదేశాలను వైకాపా లెక్కచేయడం లేదని ఆయన విమర్శించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి