ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో స్కామ్​లే తప్ప ఒక్క స్కీం లేదు: విష్ణువర్ధన్ రెడ్డి - ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిది కుంభకోణం తప్ప... ఒక్క స్కీం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని సాక్షాధారాలతో సహా నిరూపించేందుకు భాజపా సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు.

bjp leader vishnuvardhan reddy
bjp leader vishnuvardhan reddy

By

Published : Dec 30, 2020, 9:25 PM IST

శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ కుంభకోణాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు భాజపా సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.... పేదల ఇళ్ల స్థలాల కోసం 9వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్న వైకాపా నేతల మాటలను నిరూపించాలని సవాల్ విసిరారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వచ్చే నెల 5న భాజపా అధికార ప్రతినిధులు సాక్ష్యాలతో సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తోన్న వాదనలను నిరూపించేందుకు వైకాపా నాయకులు రావాలన్నారు. లేనిపక్షంలో భూదందాలపై సీబీఐ విచారణ కోరి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల స్టిక్కర్స్ వేసుకుందని ఆరోపించారు. ఇళ్ల స్థలాల స్కీంను.... స్కాంగా అభివర్ణించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details