తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గెలుస్తామనే ధీమా వైకాపాకు ఉంటే.. 24 గంటల్లో మంత్రులంతా ప్రచారం మానేసి వెళ్లిపోవాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విమర్శిస్తున్న వైకాపా నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలు మారకుండా 30 ఏళ్లుగా సోము వీర్రాజు భాజపాలోనే ఉన్నారని.. వైకాపా నాయకులు, మంత్రులు ఏ పార్టీ నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ మారే సంస్కృతి సోము వీర్రాజుకు లేదని అన్నారు.