తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి భక్తులు ఇచ్చిన 5 వేల కోట్ల రూపాయల డిపాజిట్లను ఖజానాకు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గురువారం తిరుపతిలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తితిదే బడ్జెట్లో రూ.500 కోట్లను హిందూ ధర్మానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని దుయ్యబట్టారు.
తితిదే కల్యాణ మండపాలను ప్రతి అసెంబ్లీలో నిర్మించాలని అన్నారు. గరుడ వారధికి ఖర్చు చేసిన నిధులను తితిదే ఖజానుకు జమ చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో భాజపా విజయం సాధించి తీరుతుందని ఆయన జోస్యం చెప్పారు.