తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని భాజపా జాతీయ కార్యదర్శి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. అభ్యర్థి ఖరారయ్యాక జనసేనతో కలిసి వెళ్లడంపై దృష్టి పెడతామన్న పురందేశ్వరి.. ఉపఎన్నికపై ఇరుపార్టీలు కలిసి రోడ్‌మ్యాప్ తయారు చేస్తాయన్నారు. భాజపా, జనసేన నాయకులతో కలిసి మరో కమిటీ వేస్తామన్నారు.
తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి ఖరారు కాలేదు: పురందేశ్వరి - తిరుపతి ఉపఎన్నికపై పురందేశ్వరి కామెంట్స్
తిరుపతి ఉపఎన్నికపై భాజపా నేత పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు.
భాజపా జాతీయ కార్యదర్శి పురందేశ్వరి