Bhanuprakash on collectorate: పద్మావతి నిలయాన్ని తాత్కాలిక కలెక్టర్ కార్యాలయంగా కేటాయించడాన్ని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి తప్పుబట్టారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. కలెక్టరేట్ పేరుతో పద్మావతి నిలయాన్ని ప్రభుత్వపరం చేయొద్దని సూచించారు. గతంలో తాత్కాలిక భవనాలు అని చెప్పి ఇంకా ఖాళీ చేయలేదన్నారు. ధర్మకర్తల మండలి తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఆయన.. శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు భక్తులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు.
ఆఫీసులకు ఇతర ధార్మిక సంస్థల భూములను తీసుకోగలరా అని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.