ఇదీ చదవండి:
'ఇంత చిన్న కొబ్బరికాయలా..అధికారులు ఏం చేస్తున్నారు?'
తిరుమలలో తితిదే విక్రయించే కొబ్బరి కాయలు చిన్నగా ఉన్నాయని భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద నిబంధనల మేరకు భక్తులకు టెంకాయలు అందజేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నవిగా ఉన్న కొబ్బరికాయలు కొండపైకి ఎలా చేరాయని తితిదేను ప్రశ్నించారు. అందుకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు.
Bjp leader bhanu prakash reddy police complaint on coconuts in tirumala
TAGGED:
latest updates of tirumala