తితిదే బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చవద్దని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. బోర్డులో నిబంధనలు ప్రకారం సభ్యులను నియమించాలని సూచించారు. గతంలో కొంతమంది సభ్యులు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు.
శ్రీవారి దర్శన, సేవా టిక్కెట్లను గతంలో అక్రమంగా విక్రయించారని అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారినే బోర్డు సభ్యులుగా నియమించాలని.. పరిమిత సంఖ్యలో సభ్యులను కేటాయించాలని రాష్ట్ర భాజపా తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత..