ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్వీబీసీ ఉద్యోగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి: భాను ప్రకాశ్ రెడ్డి - బీజేపీ నేత భాను ప్రకాశ్ తాజా వార్తలు

ఓ భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి అశ్లీల వెబ్​సైట్ లింక్ పంపిన వివాదంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్వీబీసీ ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు.

Bjp leader bhanu prakash
Bjp leader bhanu prakash

By

Published : Nov 11, 2020, 4:05 PM IST

తిరుపతి ఎస్వీబీసీ కార్యాలయ ఉద్యోగి ఓ భక్తుడికి అశ్లీల వెబ్​సైట్ లింక్​ పంపిన వివాదంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన.....స్వామి వారి సేవలో తరించాల్సిన ఉద్యోగులు ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు.

ఎస్వీబీసీ ఉద్యోగుల ఎంపికలోనే లోపాలున్నాయన్న ఆయన.....దేవస్థానం ఛానల్ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ఎస్వీబీసీ ఉద్యోగ వ్యవస్థను ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details