ఈనెల 10న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు పరిహారం అందడం లేదంటూ భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. కరోనా మృతుడి భార్య ఆదిలక్ష్మితో కలిసి తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఈ నెల 30లోగా బాధితులు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించకపోతే భాజపా తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
'రుయా ఘటన బాధితులకు అండగా ఉంటాం'
రుయా ఘటనలో ఆక్సిజన్ అందక తన భర్త చనిపోయినా.. ఇప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదంటూ తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
Bjp Leader Bhanuభాజపానేత భానుప్రకాశ్‌రెడ్డి