ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్యలో నా పాత్ర ఉంటే ఉరితీయండి: ఆదినారాయణ రెడ్డి - BJP leader AdiNarayana Reddy news

వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఉరితీయండని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఆయన తిరుపతిలో మాట్లాడారు.

BJP leader Adi Narayana Reddy
BJP leader Adi Narayana Reddy

By

Published : Apr 10, 2021, 2:59 PM IST

Updated : Apr 10, 2021, 3:49 PM IST

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భాజపా నేత ఆదినారాయణరెడ్డి

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయముందని తేలితే.. దిల్లీలోని సీబీఐ కార్యాలయం ముందే తనను ఉరి తీయవచ్చని భాజపా నేత ఆదినారాయణరెడ్డి సవాల్‌ విసిరారు. వివేకా హత్య కేసుపై జగన్‌ తల్లి విజయమ్మ రాసిన లేఖపై స్పందించిన ఆదినారాయణరెడ్డి.. హత్య జరిగిన ఇన్నాళ్లకు లేఖ రాయాలని అనిపించిందా అని ఆమెను ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని విజయమ్మకు సూచించిన ఆయన.. విచారణ త్వరగా జరగాలనుకుంటే దిల్లీలోని సీబీఐ కార్యాలయం ముందు తమతో పాటు ధర్నాకు కూర్చోవాలని కోరారు.

Last Updated : Apr 10, 2021, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details