తిరుపతి రుయా కొవిడ్ ఆసుపత్రిలో ప్రాణవాయువు అందక పదకొండు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల బంధువులను ఆయన పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. అవసరాలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవటంపై చూపించిన అలసత్వమే ఘటనకు కారణమన్నారు. మృతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. జరిగిన మొత్తం ఘటనపై కారకులను అన్వేషించేందుకు జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు.
'రుయా ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి' - tirupathi ruya incident updates
తిరుపతి రుయా ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి కోరారు. మృతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు.
!['రుయా ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి' bjp demands for investigation in ruya hospital incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:34:49:1620695089-320-214-10058368-428-10058368-1609324866610-1105newsroom-1620695063-1041.jpg)
bjp demands for investigation in ruya hospital incident