తిరుపతిలో నిర్వహించిన 'చాయ్ పే' చర్చ కార్యక్రమంలో వైకాపాపై భాజపా నేత సునీల్ దేవధర్ విమర్శలు గుప్పించారు. వాలంటీర్లు వైకాపా కరపత్రాలు పంచుతున్నారని ఆరోపించారు. మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని వ్యాఖ్యానించారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తిపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. వాలంటీర్లు, వైకాపా అభ్యర్థిపై రేపు సీఈసీకి ఫిర్యాదు చేస్తామని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు.
వైకాపా అభ్యర్థి, వాలంటీర్లపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం: సునీల్ దేవధర్ - జగన్పై సునీల్ దేవధర్ కామెంట్స్
తిరుపతిలో భాజపా ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమం జరిగింది. వాలంటీర్లు కమీషన్లు దండుకుంటున్నారని కార్యక్రమంలో భాజపా ఇన్ఛార్జి సునీల్ దేవధర్ అన్నారు.
bjp chai pe charcha in tirupathi