ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

8 కిలోల వరకు బరువులు ఎత్తేయొచ్చు... దేశంలోనే తొలిసారిగా బయోనిక్ చేయి - birrd hospital tirupati latest news

తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి దేశంలోనే తొలిసారిగా బయోనిక్ ఆర్మ్స్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చేతులు లేనివారి జీవితాల్లో వెలుగులు పూయించేలా వీటిని రూపొందించారు శాస్త్రవేత్తలు. విదేశాలలో వీటి తయారీకి 30 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా... బర్డ్ ఆసుపత్రిలో కేవలం 2,75,000 రూపాయల లోపు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు

birrd hospital tirupati
birrd hospital tirupati

By

Published : Dec 3, 2020, 9:48 PM IST

దేశంలోనే తొలిసారిగా బర్డ్​ ఆసుపత్రిలో బయోనిక్ ఆర్మ్స్

పుట్టుకతోనో, ప్రమాదం కారణంగానే చేతులు లేనివారికి చేదోడుగా నిలిచే విధంగా తిరుపతి బర్డ్ ఆసుపత్రి దేశంలోనే తొలిసారిగా బయోనిక్ ఆర్మ్స్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అబ్దుల్ కలాం స్ఫూర్తితో 'కల్ ఆర్మ్' పేరుతో మేకర్స్ హైవ్ సంస్థ శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ చేతులను రూపొందించారు. విదేశాలలో వీటి తయారీకి 30 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా... బర్డ్ ఆసుపత్రిలో కేవలం 2,75,000 రూపాయల లోపు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. వైకల్యంతో బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు పూయించేలా రూపొందించిన ఈ బయోనిక్ ఆర్మ్స్​ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఆసుపత్రి నిర్వాహకులను, మేకర్స్ హైవ్ సంస్థ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

ఈ బయోనిక్ ఆర్మ్​ను తొలిసారిగా హైదరాబాద్​కి చెందిన గాయత్రి అనే మహిళకు బర్డ్ ఆసుపత్రి వైద్యులు అమర్చారు. ఈ కృత్రిమ చేతి ద్వారా 8 కిలోల బరువును ఎత్తటంతో పాటు ఇందులో ఉన్న 18 గ్రిప్​ల ద్వారా పనులు చేసుకోవటం సులభంగా ఉంటుందన్నారు. ఖర్చు భరించలేని వారి కోసం ప్రాణ దానం పథకంతో పాటు, దాతల సాయం అందేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తితిదే తిరుపతి జేఈవో బసంత్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి

మాడవీధుల్లో నీటి ప్రవాహానికి చెక్‌.. రూ.కోటితో తితిదే చర్యలు

ABOUT THE AUTHOR

...view details