ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BIODEGRADABLE BAGS: తిరుమలలో బయోడీగ్రేడబుల్ సంచుల విక్రయం

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా రూపకల్పన చేసిన బయోడీగ్రేడబుల్ సంచుల(biodegradable bags) విక్రయం తిరుమలలో ప్రారంభమైంది. లడ్డూ విక్రయ కేంద్రంలో ఈ కౌంటర్​ను తితిదే ఈవో జవహర్ రెడ్డితో కలిసి డీఅర్​డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి ప్రారంభించారు.

Biodegradable Bag sales at tirumala
బయోడీగ్రేడబుల్ సంచుల విక్రయ కేంద్రం ప్రారంభం

By

Published : Aug 22, 2021, 1:12 PM IST

Updated : Aug 22, 2021, 1:51 PM IST

డీఆర్​డీవో అభివృద్ధి చేసిన పర్యావరణహితమైన సంచుల(biodegradable bags) విక్రయ కేంద్రాన్ని తిరుమలలో తితిదే ప్రారంభించింది. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా డీఆర్​డీవో అందుబాటులోకి తెచ్చిన సంచుల విక్రయం తొలుత తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రారంభించారు. శ్రీ‌వారి భక్తులు.. లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లేందుకు వీలుగా సంచుల విక్రయం ప్రారంభించారు. బయోడీగ్రేడబుల్ సంచుల విక్రయ కౌంటర్​ను తితిదే ఈవో జవహర్ రెడ్డితో కలిసి డీఅర్​డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి ప్రారంభించారు.

ఐదు లడ్డూలు పట్టే సంచి ధర రూ. 2,.. 10 లడ్డూలు పట్టే సంచి రూ. 5గా నిర్ణయించారు. పర్యావరణహితమైన ఈ సంచులను జంతువులు తిన్నా ఏలాంటి హానీ ఉండదని డీఆర్​డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. మూడు నెలల్లో భూమిలో కలసిపోయోలా ఈ సంచులను తయారు చేసినట్లు సతీశ్​ రెడ్డి చెప్పారు.

Last Updated : Aug 22, 2021, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details