చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం ఆలయంలో ఆరు అడుగుల నాగుపాము ప్రత్యక్షమైంది. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ గోపురం ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడిపోయింది. ఆలయ సిబ్బంది గమనించి... పాములు పట్టే భాస్కర్ నాయుడు అనే వ్యక్తికి సమాచారం అందించారు.
ఆలయం వద్దకు చేరుకున్న అతను పామును పట్టుకొని.. దూరంగా జూపార్క్ అటవీ ప్రాంతంలో వదలి పెట్టారు. అనంతరం ఆలయ సిబ్బంది కార్యక్రమాలు యధావిధిగా కొనసాగించారు. కరోనా కారణంగా ఆలయంలో స్వామి వారికి కొంతకాలంగా నిత్యకైంక్యర్యాలు ఏకాంతంగానే జరుగుతున్నాయి. భక్త సంచారం లేకనే పాము ఆలయంలోకి చొరబడినట్లు ఆలయవర్గాలు భావిస్తున్నాయి.