తిరుపతి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని భువనేశ్వర్‌కు చెందిన హైటెక్ గ్రూప్ ప్రతినిధులు... రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కోరారు. రాజ్‌భవన్ దర్బార్ హాలులో గవర్నర్‌తో సమావేశమయ్యారు.
హైటెక్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ తిరుపతి ప్రాణీగ్రాహీ... తిరుపతి పట్ణణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ మెడికల్ కళాశాల గురించి వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి, మెడికల్ కళాశాలలను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఈ సందర్భంగా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్... తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.