తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. తిరుపతి బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి... తెలంగాణలో ఐటీ గ్రిడ్ సంస్థపై దాడుల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉంటూ.. ఆంధ్రప్రదేశ్లో ఓట్లు అడుగుతారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పోలీసులపై అన్యాయంగా ఒక కేసు పెడితే.. తాము 4 కేసులు పెట్టగలమని హెచ్చరించారు. రెచ్చగొట్టాలని చూస్తే గట్టిగా జవాబిస్తామని స్పష్టం చేశారు. 1984 నుంచే తెదేపా డేటాను సేవ్ చేస్తున్నామని చెప్పారు. కంప్యూటర్ సాంకేతికత వినియోగించిన తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు. పారదర్శకత కోసమే అన్ని వివరాలు కంప్యూటరైజ్ చేస్తున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సరిగా ఉంటే.. తామూ సరిగా ఉంటామని.. లేదంటే వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుందన్నారు.