'ఆకుకూరలు, ఔషధ గుణాలను ఆహారంలో భాగం చేసుకోవాలి' - Ayurvedic Doctors about corona latest news
కరోనా మహమ్మారి ఉద్ధృతంగా విస్తరిస్తోంది. ఒక్కసారి శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిందంటే చాలు... క్రమంగా మనపై పెత్తనం చలాయిస్తుంది. దానికి దీటుగా సమాధానమివ్వాలంటే... మనం చేయాల్సిన పని రోగనిరోధక శక్తిని పెంచుకోవటమే అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు.
'ఆకుకూరలు, ఔషధగుణాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి'
కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే కొవిడ్ క్రమంగా శరీరంపై ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలంతా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆహారంలో ఆకుకూరలు, ఔషధ గుణాలను మిళితం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్న తిరుపతి ఎస్వీ ఆయుర్వేదిక్ వైద్యకళాశాల ద్రవ్యాగుణ విభాగాధిపతి డా.రేణూ దీక్షిత్‌తో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి.
ఇవీ చూడండి-'ఆయుర్వేదమే కరోనాను తరిమే ఔషధం!'
Last Updated : Jul 14, 2020, 4:02 PM IST