ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపీఎస్​లకు అవగాహన

ట్రైనీ ఐపీఎస్ అధికారులకు తిరుమలలోని అన్నమయ్య భవన్​లో తితిదే భదత్రా వ్యవస్థపై అవగాహన కల్పించారు. అంతకుముందు తిరుమలలో సందర్శించిన ట్రైనీలు భక్తుల సౌకర్యార్థం అవలంభిస్తున్న విధానాలను పరిశీలించారు.

Awareness on ttd Security System to Trainee ips
తితిదే భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపీఎస్​లకు అవగాహన

By

Published : Apr 1, 2021, 8:04 AM IST

తిరుమల అన్నమయ్యభవన్​లో తితిదే భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపీఎస్​లకు అవగాహన కల్పించారు. తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు.. నిఘా, భద్రతా విభాగం కార్యకలాపాలు, తిరుమల భద్రతకు సంబంధించి పోలీసులు తీసుకునే చర్యలను వివరించారు.

ముందుగా ట్రైనీ ఐపీఎస్ అధికారులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్లు, తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల భద్రతకు సంబంధించి చేపట్టిన విధానాలను పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన 24 మంది ట్రైనీ ఐపీఎస్​ల బృందంలో నేపాల్​కు చెందిన ఇద్దరూ మహిళా అధికారులు ఉన్నారు.


ఇదీ చూడండి:రాష్ట్రంలో 110 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ABOUT THE AUTHOR

...view details