తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల నుంచి స్థానికేతరులను పెద్ద ఎత్తున తరలించి దొంగ ఓట్లు వేయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిని అధికార పార్టీ నేతలు కొట్టివేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేపు చర్చనీయాంశమైంది. వైకాపాకు చెందిన ఒక నేతతో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతున్నట్లుగా ఉన్న సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ సంభాషణ ఇలా సాగింది.
ప్రజాప్రతినిధి:ఇప్పుడు ఇంత రాత్రిలో కష్టం. వచ్చినా సమయం సరిపోదని మన వాళ్ల ఫీలింగ్. ఓటింగ్ సమయం సరిపోదు.
నేత:మనకు తొమ్మిది గంటలే కదా ప్రయాణం.
ప్రజాప్రతినిధి:లేదు హడావుడి అయిపోతుంది. 450 మందికి ఏడు బస్సులు కాదు 12 బస్సులు కావాలి.
నేత:50 మంది పట్టే కెపాసిటీ సార్
ప్రజాప్రతినిధి:అయినా తొమ్మిది బస్సులు కావాలి. ఇప్పుడు 9 బస్సుల్లో వస్తే అన్నీ ఆపుతారు. మధ్యలో చాలా సమస్యలుంటాయి.
నేత:మన టీం వస్తున్నారు కదా ఎంప్లాయీస్ వాళ్లు సమన్వయం చేసుకునేందుకు.