ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడే తిరుపతి ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ ఏజెంట్స్​కి పీపీఈ కిట్ తప్పనిసరి

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం కొద్ది గంటల్లో తేలిపోనుంది. నెలరోజులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలన్నీ.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. విజయం తమదంటే తమదేనని అభ్యర్థులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నేడే తిరుపతి ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ ఏజెంట్స్​కి పీపీఈ కిట్ తప్పనిసరి
నేడే తిరుపతి ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ ఏజెంట్స్​కి పీపీఈ కిట్ తప్పనిసరి

By

Published : May 1, 2021, 3:52 PM IST

Updated : May 2, 2021, 3:02 AM IST

నేడే తిరుపతి ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ ఏజెంట్స్​కి పీపీఈ కిట్ తప్పనిసరి

తిరుపతి ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానంలో మళ్లీ ఫ్యాన్ హవానేనని ఒకరు.. వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకతో ఓటర్లు సైకిల్ ఎక్కేందుకు మొగ్గుచూపారని మరొకరు.. కమల వికాసం ఖాయమని.. హస్తం పార్టీ పునర్వైభవం ప్రారంభం కావటం పక్కా అని.. ఇలా ఎవరికివారు తమ అభ్యర్థులపై ధీమా వ్యక్తం చేస్తున్న వేళ తిరుపతి లోక్‌సభ ఫలితం ఆసక్తి రేపుతోంది. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపులో ఎంపీ ఎవరో తేలిపోనుంది. మొత్తం పాతిక రౌండ్ల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెలువడనుంది.

అధికార వైకాపా ఈ ఎన్నికల్లో 5 లక్షలపై చిలుకు మెజార్టీ సాధిస్తామంటూ చేసిన ప్రకటనలతో రాజకీయవేడి రాజుకుంది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుగురు మంత్రులు దాదాపు నెలరోజుల పాటు తిష్ఠ వేసి వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం కోసం వ్యూహాలు రచించారు. తెలుగుదేశం పార్టీ మరోసారి పనబాక లక్ష్మినే రంగంలోకి దింపి.. ఆమె విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక్కోరోజు ఒక్కో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను రంగంలోకి దింపిన భాజపా-జనసేన.. విజయం కోసం కృషి చేశాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెల్లూరు జిల్లాలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ పదోసారి బరిలో నిలిచి పోరాడారు.

పోలింగ్‌ రోజు.. భారీగా దొంగ ఓట్లు వేశారంటూ ప్రతిపక్షాలు ఇప్పటికీ మండిపడుతున్నాయి. కౌంటింగ్‌ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు సైతం అమలులో ఉండటంతో విజయోత్సవ ర్యాలీలు, సంబరాలపై నిషేధం విధించారు.

ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట సర్వీసు ఓటర్లకు ఆన్​లైన్ ద్వారా పంపించిన ఈ.టి.పి.బి.ఎస్. ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్, ఆ తర్వాత ఈ.వీ.ఎం మిషన్లలోని ఓట్లు లెక్కిస్తారు. కొవిడ్ నెగటివ్ రిపోర్టు పత్రాలు ఉంటేనే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తారు. కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ పి.పి.ఈ కిట్ తప్పక ధరించాలనే నిబంధనలు విధించారు.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 8 టేబుల్స్​లో ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకూ నో మాన్ జోన్​గా పరిగణించారు. ఔటర్ రింగ్​లో సివిల్ పోలీసులు, ఇన్నర్ రింగ్​లో ఆర్ముడ్ పోలీసు సిబ్బంది ఉంటారు. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ రూంల వద్ద కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

ప్రాణాలకే భరోసా లేదు.. భవిష్యత్​ గురించి ఏం ఆలోచిస్తారు?: చంద్రబాబు

Last Updated : May 2, 2021, 3:02 AM IST

ABOUT THE AUTHOR

...view details