ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అదనం లేదు.. అది రెండు నెలల విద్యుత్​ బిల్లు' - current usage in lockdown situation

లాక్​డౌన్​ పరిస్థితుల్లో గతంతో పోలిస్తే కరెంటు వినియోగం 70 శాతం పెరిగిందని ఏపీఎస్పీడీసీఎల్​ సీఎండీ తెలిపారు. రెండు నెలల బిల్లులు ఒకేసారి రావడం వల్ల వినియోగదారులు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు అపోహకు గురవుతున్నారని వివరించారు. పెరగనున్న విద్యుత్​ వినియోగానికి అనుగుణంగా సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

'అదనం లేదు.. అది రెండు నెలల విద్యుత్​ బిల్లు'
'అదనం లేదు.. అది రెండు నెలల విద్యుత్​ బిల్లు'

By

Published : May 8, 2020, 3:41 PM IST

అదనపు బిల్లులు అపోహేనన్న ఏపీఎస్పీడీసీఎల్​ సీఎండీ

లాక్​డౌన్ పరిస్థితుల్లో మార్చి నెల కరెంటు బిల్లుల రీడింగ్ తీసుకోవడానికి వీలుకాకపోవడం వల్ల మేలో మార్చి, ఏప్రిల్​ నెలల రీడింగ్​ తీసి వేరువేరుగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ వివరించారు. అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు నెలల బిల్లులు ఒకేసారి రావడం వల్ల వినియోగదారులు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు అపోహకు గురవుతున్నారని వివరించారు. లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు 70 శాతం అదనంగా విద్యుత్ వినియోగించినట్లు ఆయన తెలిపారు. లాక్​డౌన్ సడలింపు నేపథ్యంలో పెరగనున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్న సీఎండీ హరనాధరావుతో మా ప్రతినిధి ముఖాముఖి..!

ABOUT THE AUTHOR

...view details