భార్యాభర్తలను కాపాడిన కానిస్టేబుల్ తిరుపతిలో రైలు నుంచి పొరపాటున జారి పడిపోయిన మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తి, అంకితభావంతో వారి ప్రాణాలు కాపాడిన సతీష్‌ను మెచ్చుకుంటూ.. తిరుపతి రైల్వే అధికారులు ఘనంగా సన్మానించారు. స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది.. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. విధుల పట్ల అంకిత భావంతో గస్తీ తిరుగుతూ ఉండటం వల్లే.. సతీష్ ఇద్దరు ప్రాణాలు కాపాడగలిగారని స్టేషన్ డైరెక్టర్ ప్రశంసించారు.
ఇదీ చదవండి:హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికీ ఆక్సిజన్ పంపిణీ
తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం తిరుపతిలో దిగాల్సి ఉండగా.. నిద్రమత్తులో స్టేషన్ వచ్చిందని గమనించలేదు. ఆ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్తుండగా... రైలు నుంచి భార్యాభర్తలు కిందకి దిగే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో జారిపడిన మహిళతో పాటు ఆమె భర్తను.. అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్ ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఉదయం నాలుగున్నర గంటలకు ఘటన జరగ్గా.. స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి.
ఇదీ చదవండి:
ధూళిపాళ్ల కస్టడీ గడువు పొడిగించేది లేదు: అ.ని.శా. కోర్టు