ఉగాది పర్వదినాన ప్రతేక ఆలంకరణలో తిరుమల - tirumala
ఉగాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. పుష్పాలు, పండ్లతో ఆలయాన్ని అలంకరించారు.
శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. 4 టన్నుల పుష్పాలను, లక్ష విడి పూలను వినియోగించి... ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, పడికావాలి, ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలతో శంఖ చక్ర నామాలు తయారు చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా మామిడి, కొబ్బరి కాయలు, చెరకు గడలను, అరటి చెట్లను అలంకరణలకు ఉపయోగించారు. ఆలయం వెలుపల పుష్పాలతో ఏనుగు ఆకృతులు రూపొందించారు. శ్రీకృష్ణ విశ్వరూప దర్శన ఘట్టాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల వెలుగులో ఆలయం, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.